‘ జైలర్ ’ వ‌సూళ్ల ఊచ‌కోత‌.. ర‌జ‌నీ వీర‌విహారం చూశారా..!

సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కూమ‌ర్‌ డైరెక్షన్లో రూపొందిన సినిమా జైలర్. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, వినాయక్, వసంత్ రవి, సునీల్, మీన్రా మీనన్ కీరోల్స్ లో నటించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకత్వం వహించాడు.

బుధవారం ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే అదరగొట్టే కలెక్షన్స్ తో రికార్డ్స్ సృష్టించిన‌ ఈ మూవీ యూఎస్ లో ప్రైమ్ మీడియా వారి ద్వారా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ ఇప్పటికే ప్రీమియర్స్ తో 948కే డాలర్స్లను దక్కించుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్ను సాధించినట్లు ట్రేడ్ అనాలసిస్ లో తేలిందట. దీంతో వసూళ్ళ‌ ఊచకోత మొదలెట్టిన జైలర్ ముందు ముందు మరింతగా కలెక్షన్స్ ను వసూలు చేసే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం ఖాయంగా కనబడుతుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.