పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!

పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది.

అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ల మధ్య వార్ నడిచింది. తాజాగా వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య పోరు జరిగింది. అటు నరసారావుపేటలో వైసీపీ-టి‌డి‌పి శ్రేణుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గురజాల, సత్తెనపల్లి స్థానాల్లో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో సైతం మంత్రి విడదల రజిని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది.

ఇలా ఏడు స్థానాల్లో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఈ పోరు ఎంత తీవ్రమవుతుందో ఊహించుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో పల్నాడులోని 7 సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సారి మాత్రం టి‌డి‌పి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. దానికి ఉదాహరణలే..ఇటీవల వైసీపీతో టి‌డి‌పి గట్టిగా ఢీకొట్టడం. కానీ వైసీపీ ఆధిక్యాన్ని మాత్రం టి‌డి‌పి తగ్గించలేదనే చెప్పవచ్చు. ఇప్పటికీ పల్నాడులో వైసీపీ హవానే ఉంది.

మాచర్ల, నరసారావుపేట, పెదకూరపాడు స్థానాల్లో వైసీపీ గెలుపు ఛాన్స్ ఉంది. చిలకలూరిపేట,వినుకొండ, గురజాల, సత్తెనపల్లి సీట్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య హోరాహోరీ పోరు ఉంది. కొద్దో గొప్పో వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. అంటే పల్నాడులో మళ్ళీ వైసీపీ హవానే నడిచే ఛాన్స్ ఉంది.