మొద‌టి రోజే రూ. 30 కోట్లు అవుట్‌.. `బ్రో` ఇంకాస్త జోరు పెంచాల్సిందే!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `బ్రో`. కోలీవుడ్ ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ మూవీని తెర‌కెక్కించాడు. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన `వినోద‌య సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. నిన్న అట్ట‌హాసంగా విడుద‌లైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలే వ‌చ్చాయి.

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా న‌చ్చేసింది. అలాగే మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం లేపింది. రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ్రో సినిమా బ‌రిలోకి దిగ‌గా.. మొద‌టి రోజే రూ. 30 కోట్ల క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసేసింది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 23.61 కోట్లు షేర్‌, రూ. 35.50 గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

అలాగే రూ. 30.01 కోట్ల షేర్‌, రూ. 48.50 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను బ్రో మూవీ సొంతం చేసుకుంది. ఈ లెక్క‌న బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఇంకా 68.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టార్గెట్ ను అందుకోవాలంటే బ్రో ఇంకాస్త జోరు పెంచాల్సిందే. ఇక ఏరియాల వారీగా బ్రో మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి…

నైజాం: 8.45 కోట్లు
సీడెడ్: 2.70 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 2.60 కోట్లు
తూర్పు: 2.45 కోట్లు
పశ్చిమ: 2.98 కోట్లు
గుంటూరు: 2.51 కోట్లు
కృష్ణ: 1.21 కోట్లు
నెల్లూరు: 0.71 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 23.61కోట్లు(35.50కోట్లు~ గ్రాస్)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.10 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4.30 కోట్లు
———————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 30.01కోట్లు(48.50కోట్లు~ గ్రాస్)
———————————————-