పడిపోయిన పవన్ క్రేజ్.. ఫ్రూప్ తో సహా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల చిత్రాలు సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయ్యాయంటే టాక్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న ఈ సినిమా చాలామందికి నచ్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఒక పెద్ద హీరోకు ఉండాల్సిన కథనం ఈ సినిమాలో లేవని ఏదో కేవలం ఊహించుకొని వెళితే ఈ సినిమా అభిమానులకి పిచ్చెక్కించేలా చేస్తుంది.

ఇంటర్వెల్ క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు సరిగ్గా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా విఫలమయింది బ్రో సినిమా కర్నూలు బుకింగ్స్ విషయానికి వస్తే ఒక షో మినహా ఏ షో కూడా కనీసం 50% ఆక్యుపేసి లేదట.. కర్నూల్లోని ప్రముఖ థియేటర్లో బుకింగ్ ఈ విధంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా ఈ సినిమా రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉండడం కూడా ఈ సినిమాకి కాస్త మైనస్ అయినట్లుగా సమాచారం. మరి ఇలా అయితే కలెక్షన్లు రాబట్టడం కూడా చాలా కష్టమే అన్నట్లుగా పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం వల్ల తన కెరియర్ మొత్తం పాడవుతోందని తెలియజేస్తున్నారు… అంతేకాకుండా తెలిసి తెలియని మాటలు మాట్లాడి కూడా ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నారు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రో సినిమా పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్త పడి తన సినిమాలను తెరకెక్కించాలని తెలియజేశారు.. పవన్ సినిమాల రిలీస్ చిత్రాలను కూడా తగ్గించడం చాలా మంచిదని కూడా పలువురు నెటిజెన్లు తెలుపుతున్నారు.