పెళ్లంటే చాలా కష్టమంటూ.. ఐడియల్ హస్బెండ్‌పై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనుదీప్ దర్శకత్వం వహించిన ‘జాతిరత్నాలు’ సినిమా లో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ అమ్మడు నటించిన మొదటి సినిమానే మంచి విజయం సాధించడం తో బాగా ఫేమస్ అయింది . జాతిరత్నాలు సినిమా లో హీరో నవీన్ పోలిశెట్టి తో ప్రేమాయణం నడిపిస్తూనే, కోర్ట్ సన్నివేశాలో కామెడీ అధరగొట్టేసింది ఫరియా. ఈ సినిమా హిట్ అయిన తరువాత ఫరియా కి వరుస అవకాశాలు వచ్చి చేరాయి.

ఆ తరువాత అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఫిదా చేసింది. రీసెంట్గా రిలీజ్ అయిన రావణాసుర సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను అల్లరించింది. ఈ అమ్మడు సినిమాలోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబందించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఫరియా పోటీ బట్టలు వేసుకొని గ్లామర్ షో చెయ్యడం మొదలు పెట్టింది . దానివల్ల ఫ్యాన్స్ నుండి విమర్శలు కూడా ఏదుర్కొంటుంది.

ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ కి హాజరైన ఫరియా కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది . యాంకర్ ఫరియాని పెళ్లి గురించి ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్తూ ‘ పెళ్లి చేసుకోడం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఒక్కరితోనే ఉండాలి. అలా ఒకరితోనే ఉంటూ రిలేషన్ పెంచుకుంటూ పోవడం అంటే చాలా కష్టం ‘ అని చెప్పింది. పెళ్లి గురించి ఫరియా చేసిన వ్యాఖ్యలు విన్న చాలా మంది ఆమెని తిట్టిపోస్తున్నారు. ‘ నీలాగా ఆలోచించే వాళ్ళని పెళ్లి చేసుకోడం వళ్ళనే తొందరగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.