వెస్ట్‌లో వైసీపీ జీరో..పొత్తు లేకపోయినా డౌటే.!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? అంటే..అది ఎక్కువగానే ఉందని చెప్పాలి..కాకపోతే వైసీపీ ఓటర్లు మాత్రం…మళ్ళీ జగనే సి‌ఎం అవుతారని అంటున్నారు…టి‌డి‌పి, జనసేన ఇతర పార్టీల ఓటర్లు..జగన్‌ మళ్ళీ గెలవరని అంటున్నారు. కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీకి వెళితే..వైసీపీకి వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో వైసీపీ బోణి కూడా కొట్టదా? అనే పరిస్తితి.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా అంటే నరసాపురం పార్లమెంట్ పరిధి.. అక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమే అంటున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఏడు సీట్లు ఉన్నాయి. పాలకొల్లు, ఉండి, తణుకు, ఆచంట, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం. గత ఎన్నికల్లో  పాలకొల్లు, ఉండి టి‌డి‌పి గెలుచుకుంది..మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. అది కూడా టి‌డి‌పి, జనసేన మధ్య ఓట్లు చీలడం వల్లే గెలిచింది.

అయితే ఈ సారి టి‌డి‌పి, జనసేన మధ్య పొత్తు ఉండబోతుంది..పొత్తు ఉంటే వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చేలా లేదు. పొత్తు లేకపోయినా వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదట. ఇటీవల జరిగిన తాజా సర్వేలో టి‌డి‌పి..పాలకొల్లు, ఉండి, తణుకు సీట్లు గెలుచుకుంటుందని, జనసేన..భీమవరం, నరసాపురం సీట్లు గెలుచుకుంటుందని తేలింది.

ఇక ఆచంట, తాడేపల్లిగూడెంలో టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఈ రెండు సీట్లు గెలిచేసుకుంటాయి. అందులో డౌట్ లేదు. అంటే ఎటు చూసుకున్న వెస్ట్ లో వైసీపీ జీరో అని చెప్పవచ్చు.