ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ పవర్ స్టార్.. అప్పుడే ఎంత మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చారో తెలిస్తే షాకే!

సినీ తార‌లు సోష‌ల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అభిమానుల‌కు చేరువ అయ్యేందుకు వారికి వ‌న్ అండ్ ఓన్లీ ఆప్ష‌న్ సోషల్ మీడియానే. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ ద‌గ్గ‌ర నుంచి ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన అనేక విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు.

దాదాపు సినీ తార‌లంద‌రూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదు. అయితే తాజాగా ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జై హింద్‌!` అని తన అకౌంట్ బ‌యోలో పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ టీం ఈ అకౌంట్ ని మేనేజ్ చేస్తుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అఫీషియ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక్క పోస్ట్ కూడా ప‌డలేదు. కానీ, ఫాలోవ‌ర్స్ మాత్రం కుప్ప‌తెప్ప‌లుగా వ‌చ్చిప‌డుతున్నారు. అభిమానులే కాకుండా ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషానికి ఫాలోవ‌ర్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఆరు ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్స్ వ‌చ్చేశారు. ఫాలోవ‌ర్స్ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌రికొత్త రికార్డును సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.