బాబుకు పొత్తుల టెన్షన్..పవన్‌ ముంచుతున్నారా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బి‌జే‌పితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బి‌జే‌పితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పిపై పడుతుంది.

ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ వరకు పొత్తు ఓకే..కానీ బి‌జే‌పితోనే తంటా..ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పికి ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. పైగా రాష్ట్రానికి పెద్దగా న్యాయం చేయలేదని చెప్పి బి‌జే‌పిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో బి‌జే‌పిని కలుపుకుని వెళితే..ఆ నెగిటివ్ మొత్తం టి‌డి‌పిపై పడుతుంది..దాంతో వైసీపీకి మేలు జరుగుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అయితే పవన్ మాత్రం టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసే పోటీ చేస్తాయని చెబుతున్నారు.

చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే టి‌డి‌పి-బి‌జే‌పి కలుస్తాయని అంటున్నారు. అలాగే సి‌ఎం పదవి ఎన్నికల్లో గెలిచాక అప్పుడు బలాబలాల బట్టి తేల్చుకుంటామని అంటున్నారు. ఇదే ఇప్పుడు టి‌డి‌పి శ్రేణులకు ఆగ్రహం  తెప్పిస్తుంది. అసలు టి‌డి‌పి 40 శాతం పైనే ఓట్లు ఉన్న పార్టీ అని, 10 శాతం కూడా లేని జనసేన సి‌ఎం సీటు డిసైడ్ చేయడం ఏంటి అని అంటున్నారు.

పైగా ముందే సి‌ఎం సీటు డిసైడ్ చేయకపోతే అది వైసీపీకి లాభం చేస్తుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి వారు సి‌ఎం ఎవరవుతారని ఎద్దేవా చేస్తున్నారు. ఒక సి‌ఎం అభ్యర్ధి లేకుండా ఎన్నికలకు వెళితే అది భారీ నష్టం చేస్తుంది. ఆటోమేటిక్ గా జగన్‌కు మేలు చేస్తుంది. కాబట్టి ఎటు చూసుకున్న టి‌డి‌పికి తలనొప్పులే..మరి ఈ విషయంలో బాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి.