మెగా ప్రిన్సెస్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన కొమరం భీమ్.. ఎవరు ఊహించని గిఫ్ట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని చెప్పవచ్చు..RRR చిత్రంతో మరింత స్నేహంగా మారారు. ఇక పలు సందర్భాలలో వీరిద్దరూ తమ స్నేహ బంధాన్ని తెలియజేస్తూ పలు రకాల గిఫ్ట్లను కూడా పంపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ మధ్య అన్యోన్యత పెరిగిపోయింది. ఉపాసన ,లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు వారు షేర్ చేసే ఫోటోలు ఇందుకు ఉదాహరణగా తెలియజేస్తూ ఉంటాయి.

RRR: Jr NTR Finally Breaks Silence On His Dispute With Ram Charan, “There Have Been 30-35 Odd Years Of Rivalry Between The Families”

గడచిన కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ జన్మించిన సంగతి తెలిసిందే.. మెగా ప్రిన్సెస్ పేరు క్లింకార.. ఎన్టీఆర్ మెగా ప్రిన్సెస్ కు ఒక గిఫ్ట్ పంపించారనే వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.. అయితే కొమరం భీమ్ పంపించిన ఆ గిఫ్ట్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఎవరు ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గోల్డ్ డాలర్ ను బహుమతిగా పంపించినట్లు సమాచారం.

RRR actors' lavish homes - 40 pics & videos of Ram Charan's Rs 30 Cr abode & Jr NTR's Rs 25 Cr mansion | GQ India

అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఆ గోల్డ్ డాలర్ పైన క్లింకార, రామ్ చరణ్, ఉపాసన పేర్లు వచ్చేలా ప్రత్యేకంగా ఈ డాలర్ పైన డిజైన్ చేయించినట్లు సమాచారం. ఈ గిఫ్ట్ చూసిన చరణ్ ఫ్యామిలీ కూడా చాలా ఫీల్ అయినట్లుగా టాక్వి నిపిస్తోంది..

ఈ విషయం విన్న తర్వాత మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో RRR -2 కూడా ఉంటుందని విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలే తెలియజేయడం జరిగింది. అయితే ఈ సినిమాని వేరొకరు దర్శకత్వం వహిస్తారని తెలియజేశారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు.