టీడీపీ బీసీ మంత్రం..జగన్‌ని దాటడం కష్టమే.!

తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ..అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే ఇది ఒకప్పుడు మాత్రమే..ఇప్పుడు బి‌సిలు జగన్ వైపు ఉన్నారు. అందుకే జగన్ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి టి‌డి‌పి వచ్చాక బి‌సిలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి కీలక స్థానం దక్కింది. ఎన్టీఆర్..బి‌సిలకు పెద్ద పీఠ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అదే పంథా కొనసాగించారు.

కానీ నిదానంగా టి‌డి‌పిలో బి‌సిలకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వారికి పదవులు ఇస్తున్నారని గాని..పెత్తనం మాత్రం ఒక అగ్రకులానికే ఉంటుంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరిగింది. పూర్తిగా ఒక కులానికి అధికారం దక్కింది. అందుకే బి‌సిల్లో మార్పు వచ్చింది. 2019 ఎన్నికల్లో మెజారిటీ బి‌సిలు వైసీపీకి ఓటు వేశారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చాక అన్నీ కులాలతో పాటు బి‌సిలకు పెద్ద పీఠ వేస్తూ వస్తున్నారు. ఏ కులానికి..ఆ కులం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌లని నియమించారు. ఇక బి‌సిలకు పెద్ద ఎత్తున పథకాలు అందిస్తున్నారు. బి‌సిల అభ్యున్నతి కోసం జగన్ కష్టపడుతున్నారు.

అందుకే ఇప్పటికీ బి‌సిల మెజారిటీ సపోర్ట్ జగన్‌కే ఉంది. రానున్న ఎన్నికల్లో బి‌సిల మద్ధతు వైసీపీకే దక్కేలా ఉంది. అయితే బి‌సిలని ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే బి‌సిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇటు లోకేశ్ పాదయాత్రలో బి‌సి వర్గాలతో సమావేశంవుతూ వస్తున్నారు.

తాజాగా బి‌సిలతో సమావేశమై.. బలహీనవర్గాల్లో ఉపకులాల వారీ కుల వృత్తులను ప్రోత్సహిస్తామని, గతంలో టీడీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరిస్తామని,  బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామని,  బటన్‌ నొక్కితే శాశ్వత కులధ్రువీకరణ పత్రం ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని,  ఆయా కులవృత్తులకు అవసరమైన మేరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఎన్ని హామీలు ఇచ్చిన బి‌సిలు టి‌డి‌పిని నమ్మేలా లేరు. వారు పూర్తిగా జగన్ వైపే ఉన్నారు.