మళ్లీ అదే తప్పు చేస్తున్న రష్మిక.. డేంజర్లో కెరియర్..!!

టాలీవుడ్ లో కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సైతం అందుకుంది. తనకు వచ్చిన పాత్రలలో పూర్తిగా న్యాయం చేస్తూ టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్ లిస్టులో కూడా చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం వంటి చిత్రంలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ కూడా పలు సినిమాలలో నటిస్తోంది రష్మిక.

Rashmika Mandanna Age, Net Worth, Career, Education, and Lot's More | DTFUN

అయితే రష్మిక ఇప్పటికి ఏడాదిన్నర పైగా అవుతున్న తెలుగులో ఏ ఒక్క సినిమాకి సైన్ చేయలేదు. హీరో నితిన్ తో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్మెంట్ చేయగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. కొద్దిగా స్టార్ క్రేజీ వచ్చిన తర్వాత ఆఫర్లను చేయకుండా సినిమాలలో అది ఉండాలి ఇది ఉండాలని హీరోయిన్స్ సినిమా కథలను రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.. స్టార్ హీరోయిన్ల విషయంలో ఇది చాలా సార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది.

రష్మిక ఈమధ్య తన దగ్గరకు వచ్చిన రెండు చిత్రాలను రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కథ నచ్చలేదో మరి ఏదో కారణం చేత తెలుగులో అసలు సినిమాలు లేని సమయంలో ఆఫర్ ని కాదనడం రష్మిక గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. రష్మిక కూడా కెరియర్లో చాలా పొరపాట్లు చేస్తుందని తెలుగు సినిమా కోసం ఆమె అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తున్నారు.. నితిన్ తో ఓకే చెప్పిన సినిమా దాదాపుగా ఈమె తప్పుకున్నట్లేని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక చేయకపోవడం వల్ల మీనాక్షి చౌదరికి ఈ సినిమా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.ఇలా అయితే రష్మికను తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇక మీదట రష్మిక.. కెరియర్ పైన జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుందని వాటిల్లుతున్నారు.