శ్రీలీల పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. సీనియర్ జూనియర్ తో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.ఏ హీరోతో అవకాశం వచ్చిన సరే చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ముందుకు వెళుతోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే పలు రకాల సినిమాలలో సిస్టర్ రోల్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఏ హీరోకి రానంత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

రోజు రోజుకి మార్కెట్లో శ్రీ లీల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూనే ఉంది. స్టార్ హీరోయిన్ల లీగ్ కి అతి చేరువలో ఉన్నది.. గుంటూరు కారం సినిమాలో ఈ ముద్దుగుమ్మ అవకాశం లభించడంతో అక్కడి నుంచి ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.ఈ సినిమా హిట్ పడితే ఈమె రేంజ్ మారిపోతుందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీ లీల గురించి ఒక అగ్ర నిర్మాత ఏమనుకుంటున్నాడో నటుడు బ్రహ్మాజీ రివీల్ చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Brahmaji unhappy with south-Indian actresses | Telugu Movie News - Times of  India

ప్రస్తుతం బ్రహ్మాజీ స్లమ్ డాగ్ హస్బెండ్ అనే చిత్రం రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో తన కుమారుడు హీరోగా నటిస్తూ ఉన్నారు.. ఇందులో యాంకర్ మీరు మళ్ళీ హీరోగా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ తో నటిస్తారని అడగగా శ్రీ లీల అయితే బాగుంటుందని తెలియజేశారు. ఈ అమ్మాయి డాన్స్లు బాగా చేస్తుంది డాన్సులు నాకు రావు అనుకుంటారేమో నేను కూడా బాగానే చేస్తానంటూ తెలిపారు. శ్రీ లీల అతివేగంగా స్టార్డం అందుకుంది.. ఈమె ఎనర్జీ లెవెల్ చూస్తూ ఉంటే జయప్రద, జయసుధ, శ్రీదేవి హీరోయిన్ల రేంజ్కి వెళుతుందని ఒక బడనిర్మాత తనతో అన్నారని తెలిపారు ఆయనది అన్నది జరగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. స్లం డాగ్ హస్బెండ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా శ్రీ లీల రావడం జరిగింది.