ఏం జరిగినా నాకు ఏదో ఒక గుణపాఠం..ఎమోషనల్ ట్వీట్ చేసిన రాజ

RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పాన్ ఇండియానే కాకుండా హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు రాజమౌళి.. తెలుగు సినీ పరిశ్రమలొ ఇప్పటివరకు ఫ్లాప్ మూవీ ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందారు. ఈయన తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎప్పటికప్పుడు ఒక ట్రెండును సెట్ చేస్తూ ఉంటాయి.

The SS Rajamouli connection in Pushpa, RRR and KGF2 - BusinessToday

సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు రాజమౌళి. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా మరొకసారి సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో అనే విషయాన్ని ట్విట్టర్ రూపంలో తెలియజేశారు.. హైదరాబాదులోని సినీ ప్రియులకు ఎక్కువగా మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదటి రోజు మొదటి షో అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రసాద్ ఐమాక్స్.. ఈ మల్టీప్లెక్స్ ప్రయాణానికి ఒక చరిత్ర ఉన్నది కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అక్కడ అభిమానులు తెగ జాతర చేస్తూ ఉంటారు.

ఈ మల్టీప్లెక్స్ స్థాపించి ఇప్పటికీ 20 ఏళ్లు కాబోతున్న సందర్భంగా రాజమౌళి ఒక వీడియోను షేర్ చేశారు.. ఈ వీడియోలో ఎన్ని శుక్రవారం ఫస్ట్ షోలు ఉదయాన్నే 8.45 సీట్లో కూర్చోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఇప్పటికి 20 ఏళ్లు అవుతోందా ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉన్న నిరాశపరిచిన నాకు గుణపాఠం చెబుతోంది ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్ మీరు సినిమా మాత్రమే కాదు మీరు నా తరగతి గది అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేయడం జరిగింది రాజమౌళి.