ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్‌.. అలాంటి వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో ఫ్యాన్స్‌కి షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. 2013లో ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్డేట్ ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ తో పాటు ఫేస్‌బుక్ లోనూ ప్ర‌భాస్ పంచుకుంటాడు. ఫేస్‌బుక్ లో ఆయ‌న‌కు ఏకంగా 24 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్‏తో మొద‌ట ఈ వీడియో పోస్ట్ అయింది. ఆ త‌ర్వాత అడవుల్లో సైక్లింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన యువకుల దృశ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ఫన్నీ మూమెంట్స్ ఇలా సంబంధం లేని పోస్ట్ లు ప్ర‌భాస్ ఫేస్ బుక్ ఖాతాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి.

వాటిని చూసి డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అయ్యాడు. ప్ర‌భాస్ ఫేస్ బుక్ హ్యాక్ అయిందంటూ గగ్గోలు పెట్టారు. దాంతో అప్ర‌మ‌త్త‌మైన టీమ్ సమస్యను పరిష్కరించింది. కొద్ది సమయం తర్వాత ప్రభాస్ ఫేస్‏బుక్ ఖాతాను తిరిగి పునరుద్దరించారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `స‌లార్‌`, `క‌ల్కి 2898 ఏడీ` చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్ రెండు పార్టులుగా విడుద‌ల కాబోతోంది. క‌ల్కి వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాపై అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి.