ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ ఆ మధ్య పవన్ కల్యాణ్ కాకినాడ వచ్చి..వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇక ముద్రగడ బయటకొచ్చి..ద్వారంపూడికి మద్ధతుగా మాట్లాడారు. అలాగే దమ్ముంటే ద్వారంపూడిపై పోటీచేయాలని, లేదా తనని పిఠాపురంలో పోటీ చేయడానికి ఆహ్వానించి…అక్కడ పవన్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీని బట్టి చూస్తే ముద్రగడ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అది కూడా ఆయన వైసీపీ నుంచి బరిలో దిగడం ఖాయమని చెప్పవచ్చు.

ముద్రగడ టి‌డి‌పి హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఓపెన్ అయ్యి పార్టీలోకి రావడానికి రెడీ అయ్యారు. ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తుంది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు పెద్దగా పాజిటివ్ లేదని తెలుస్తుంది. దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని తెలుస్తుంది. లేదంటే కాకినాడ ఎంపీగా పోటీ చేయించే ఛాన్స్ ఉంది.

అటు ముద్రగడ పోటీ చేయకపోతే..ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయం..పిఠాపురం లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది.