`బ్రో` మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఇదా.. త్రివిక్ర‌మ్ ఎందుకు చెడ‌గొట్టాడు?

బ్రో.. ఫైన‌ల్ గా నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్‌కు సుముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. కేతిక శ‌ర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌త సిత్త‌కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో సినిమా నేడు భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంద‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌న్ మ్యాన్ షో చేశాడ‌ని అంటున్నారు. ఫ్యాన్స్ కోరుకునే స్ట‌ఫ్ సినిమాలో దండిగా ఉంద‌ని తెలుస్తోంది. అయితే కొంద‌రు యావ‌రేజ్ అని కూడా రివ్యూ ఇస్తున్నారు. ఇక‌పోతే విడుద‌ల సంద‌ర్భంగా ఈ మూవీకి సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వస్తున్నాయి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ బ్రో కాద‌ట‌.

లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు… గడచిన కాలం తిరిగి రాదు. కానీ ఆ కాలమే దిగివచ్చి చనిపోయిన వ్యక్తికి మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న‌దే ఈ సినిమా స్టోరీ. అయితే స్టోరీకి త‌గ్గ‌ట్లుగా సముద్రఖని మొద‌ట ఈ చిత్రానికి `కాల పురుషుడు` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ను అనుకున్నారట. కానీ, త్రివిక్ర‌మ్ ఆ టైటిల్ వ‌ద్ద‌ని చెడ‌గొట్టాడ‌ట‌. ఎమోషన్స్ తో సాగే మూవీ ఇది. అంత ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెడితే అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ‌తాయి. ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అందుకే సింపుల్ గా `బ్రో` అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశార‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను తేజ్ త‌ర‌చూ బ్రో అని పిలుస్తాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే బాగా ఆలోచించి బ్రోను ట్రైటిల్ గా ఫిక్స్ చేశారు.