కే జి ఎఫ్-2 రికార్డ్ ను బీట్ చేసిన బేబీ చిత్రం..!!

గత కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించింది.. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియస్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కీలకమని చెప్పవచ్చు.

Baby Movie Review: A pathos-laden love story that'll leave you with mixed  feelings

ముఖ్యంగా ఈ చిత్రంలో ఆనంద దేవరకొండ, విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్య పాత్రలు హైలైట్ గా ఉన్నాయని తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ సినిమా దాదాపుగా ఇప్పటివరకు రూ .70 కోట్ల మార్కును దాటేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఇప్పుడు మరొక రికార్డు బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏకంగా కన్నడ హీరో యష్ నటించిన కే జి ఎఫ్-2 రికార్డును సైతం బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది.

Yash Surprise For Fans, It's Not KGF Chapter 2

గతంలో కేజిఎఫ్-2 చిత్రం వరుసగా 12 రోజులపాటు కోటి రూపాయలు వసూలు చేసింది. తాజాగా బేబీ సినిమా కూడా 13 రోజులపాటు కోటికి పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది దీంతో కేజిఎఫ్ -2 రికార్డును కూడా బ్రేక్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల ఇప్పటికి రెండు వారాలు కావస్తున్న రోజురోజుకీ కలెక్షన్ల పరంగా భారీగానే వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి కలెక్షన్లు కూడా దాటి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నది.