నెల్లూరు రూరల్‌లో లోకేష్‌కు భారీ మద్ధతు..తొలి విజయం దిశగా.!

నెల్లూరు రూరల్ నియోజకవర్గం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైసీపీదే విజయం. అంతకముందు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ నెల్లూరు రూరల్.. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు. అయితే టి‌డి‌పికి 2019లోనే డైరక్ట్ పోటీ చేసింది.

2009లో టి‌డి‌పి పొత్తులో భాగంగా సి‌పి‌ఐ పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. 2014లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా బి‌జే‌పి పోటీ చేసి ఓడిపోయింది. పొత్తు వల్ల టి‌డి‌పి ఓట్లు బదిలీ కాలేదు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పి డైరక్ట్ బరిలో దిగింది..కానీ వైసీపీ వేవ్ లో 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే 2019లో టి‌డి‌పి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. కానీ ఆయన చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్ చేసి..నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

దీంతో టి‌డి‌పి నుంచి అబ్దుల్ అజీజ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక వైసీపీ నుంచి రెండుసార్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు..అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన సరిగా పనిచేయలేకపోతున్నామని అసంతృప్తితో ఉంటూ..సొంత పార్టీ వాళ్ళే తనపై కుట్ర చేస్తున్నారని చెబుతూ..ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇక టి‌డి‌పి వైపు వచ్చేశారు. డైరక్ట్ పార్టీలో చేరలేదు గాని..ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చారు.

ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర నెల్లూరు రూరల్ లో ఎంటర్ కాగా, ఆయనకు భారీ స్వాగతం పలికారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా లేని విధంగా లోకేష్‌కు స్వాగతం పలికారు. ఇక పాదయాత్రలో భారీ స్థాయిలో జనం వచ్చారు. దీంతో నెల్లూరు రూరల్ టి‌డి‌పిలో జోష్ నెలకొంది. దీంతో తొలిసారి అక్కడ టి‌డి‌పికి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. టి‌డి‌పి ఓటింగ్ ప్లస్, కోటంరెడ్డి ఇమేజ్ తో నెక్స్ట్ రూరల్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయి.