మోక్షజ్ఞ ఎంట్రీ కోసం లక్కీ హీరోయిన్ దింపుతున్న బాలయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇక ఎప్పటినుంచో బాలయ్య అభిమానులు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బాలయ్య కుమారుడు చాలా స్లిమ్ అయి కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య ఇప్పటికి హీరోగా ఆరు పదులు వయసులో కూడా అదరగొట్టేస్తున్నాడు.

Balayya Gave An Update On The Movie With Mokshajna.. Everything Is Divine!

తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాలయ్య కుమారుడిని తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఆదిత్య -369 సినిమా సీక్వెల్ ని చేయబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా మోక్షజ్ఞ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే మోక్షజ్ఞ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఒక కుర్ర హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Sreeleela Biography, Wiki, Age, Nationality, Net Worth, Boyfriend

మోక్షజ్ఞ కోసం బాలయ్య ఒక హీరోయిన్ను సెలెక్ట్ చేయడం జరిగిందట.. ఆ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోలు సరసన నటిస్తూ చాలా బిజీ హీరోయిన్గా మారిపోయింది.ఆమె ఎవరో కాదు యంగ్ హీరోయిన్ శ్రీ లీల.. ఈ అమ్మడు మోక్షజ్ఞ కు సరి జోడిగా ఉంటుందని బాలయ్య భావించి ఈమని హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్యతో నటిస్తున్న ఈ భామ త్వరలో బాలయ్య కొడుకుతో కూడా నటించబోతోందని తెలుస్తోంది మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారు తెలియాల్సి ఉన్నది.