మృణాల్ మామూల్ది కాదు.. 10వ త‌ర‌గ‌తిలోనే క్లాస్ మేట్ తో ఆ ప‌ని చేసిందా..?

`సీతారామం` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్‌.. రీసెంట్ గా `ల‌స్ట్ స్టోరీస్ 2`తో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ యాక్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ల‌స్ట్ స్టోరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మృణాల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గోంది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ ల‌వ్‌, బ్రేక‌న్స్‌, లైఫ్ పార్ట్‌నర్.. ఇలా అనే అంశాల‌పై మాట్లాడింది. ఇంట్రెస్టింగ్ విష‌యం మృణాల్ 10వ త‌ర‌గ‌తిలో త‌న క్లాస్ మేట్ తో ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అవును, టెన్త్ క్లాస్ చ‌దువుతున్న రోజుల్లోనే త‌న క్లాస్ మేట్ మృణాల్ కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్ చేశాడ‌ట‌. అత‌డు అందంగా ఉండ‌టంతో మృణాల్ వెంట‌నే అత‌డికి ఓకే చెప్పేసింద‌ట‌. అయితే కొద్ది రోజులు అత‌నితో రిలేష‌న్ బాగానే సాగినా.. పై చదువుల కోసం మృణాల్ ముంబై వెళ్ల‌డంతో బాయ్‌ఫ్రెండ్ కు దూర‌మైంది.

అలాగే సినిమాల్లోకి రాక‌ముందు మ‌రొక వ్య‌క్తితో మృణాల్ ల‌వ్ లో ప‌డింద‌ట‌. కానీ, కొద్ది రోజుల‌కే అత‌డితో కూడా బ్రేక‌ప్ అయింద‌ట‌. ఈ విష‌యాల‌ను మృణాల్ స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. ఇక లైఫ్ పార్ట‌న‌ర్ గురించి మాట్లాడుతూ.. తన ఫీలింగ్స్‌ను ఎప్పుడూ గౌరవించే వ్య‌క్తి త‌న‌కు భ‌ర్త‌గా రావాల‌ని మృణాల్ పేర్కొంది. అంతేకాదు, పెళ్లి చేసుకుంటే అవకాశాలు కోల్పోతాననే భయం కూడా త‌న‌కు లేద‌ని మృణాల్ తెలిపింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.