కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?

గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టి‌డి‌పి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టి‌డి‌పి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది.

అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో వైసీపీ మళ్ళీ సత్తా చాటుతుందా? అంటే ఈ సారి చెప్పడం కష్టమే. ఇప్పటికే కమ్మ వర్గం టార్గెట్ గా వైసీపీ చేసే రాజకీయం గురించి తెలిసిందే. దీంతో కమ్మ వర్గం యాంటీ అవుతూ వస్తుంది. అలాగే ఆయా స్థానాల్లో టి‌డి‌పి బలపడుతుంది. దీంతో ఈ సారి కమ్మ ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీకి చెక్ పడేలా ఉంది.

అలాంటి స్థానాల్లో దెందులూరు, రాజానగరం, ఉంగుటూరు, నిడదవోలు స్థానాలు ముందు ఉన్నాయి. ఈ స్థానాల్లో టి‌డి‌పి నుంచి కమ్మ నేతలు ఉన్నారు..అలాగే ఈ స్థానాల్లో కమ్మ వర్గం ఓట్లు ఎక్కువే. అలాగే ఇటు మైలవరం, పెనమలూరు స్థానాల్లో కూడా సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు చోట్ల వైసీపీ విజయం అంత సులువు కాదు. ఇక తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు, గురజాల లాంటి స్థానాల్లో టి‌డి‌పి నుంచి కమ్మ నేతలు రేసులో ఉన్నారు..ఈ స్థానాల్లో కూడా వైసీపీకి గెలుపు కష్టమే. మొత్తం మీద ఈ సారి కమ్మ కోటల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవు.