అదే నేను చేసిన అతిపెద్ద త‌ప్పంటున్న ఆమ‌ని.. ఆమె కెరీర్ ను నాశ‌నం చేసింది ఎవ‌రో తెలుసా?

న‌టి ఆమ‌ని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన ఆమ‌ని.. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతోంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆమ‌ని సినిమాల‌కు దూర‌మైంది. హీరోయిన్ గా వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న త‌రుణంలో ఆమ‌ని ఇండిస్ట్రీని వ‌దిలేసింది.

అస‌లు ఆమ‌ని కెరీర్ ను నాశ‌నం చేసిందో ఎవ‌రో తెలుసా.. ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ నిర్మాత ఖాజా మొహిద్దినే అట‌. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమ‌ని ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది. ఖాజా మొహిద్దిన్ అనే ముస్లిం వ్యక్తిని ఆమ‌ని పెళ్లి చేసుకుంది. 1990 లో వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత ఆమ‌ని హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఎందుకంటే, పెళ్లికి ముందే ఖాజా మొహిద్దిన్ సినిమాలు చేయ‌కూడ‌ని ఆమ‌నికి కండీష‌న్ పెట్టాడ‌ట‌.

అందుకు ఆమ‌ని వెంట‌నే అంగీక‌రించింద‌ట‌. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసారు. పెళ్లి చేసుకోవ‌డ‌మే నేను చేసిన అతిపెద్ద త‌ప్పు. పెళ్లి త‌ర్వాత సినిమాలు వ‌దిలేయాని నా భ‌ర్త కండీష‌న్ పెట్టాడు. అందుకే నాకోసం పెద్ద పెద్ద బ్యానర్స్ మరియు స్టార్ హీరోలు రెడీ గా ఉన్నారని తెలిసినా కెరీర్ ని వదిలేసుకున్నాను. ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. పిల్ల‌లు పుట్టాక ఆ బాధ కాస్త త‌గ్గింది. కొన్నాళ్ళకు సినిమాల్లో నటించే అవకాశం మ‌ళ్లీ వ‌చ్చింది. అప్పుడే వెన‌క్కి త‌గ్గాల‌ని అనిపించ‌లేదు. భ‌ర్త‌ను ఒప్పించి మ‌ళ్లీ న‌టించ‌డం స్టార్ట్ చేశా అంటూ ఆమ‌ని చెప్పుకొచ్చింది. ఈమె ఇప్పుడు సినిమాల్లోనే కాదు బుల్లితెర‌పై సీరియ‌ల్స్ కూడా చేస్తూ స‌త్తా చాటుతోంది.