తణుకులో హోరాహోరీ..అరిమిల్లి వర్సెస్ కారుమూరి..లీడ్ ఎవరిది?

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది..కానీ ఈ సారి టి‌డి‌పి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. అలా అని వైసీపీ తేలికగా వదిలే ఛాన్స్ లేదు. మళ్ళీ టి‌డి‌పిని చితు చేసి గెలవాలని చెప్పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి తణుకు నియోజకవర్గంలో ఫైట్ హోరాహోరీగా సాగనుంది.

గత ఎన్నికల్లో తణుకులో వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, టి‌డి‌పి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. అయితే జనసేన ఇక్కడ భారీగా ఓట్లు చీల్చింది. దీంతో కారుమూరి 2 వేల ఓట్ల తేడాతో అరిమిల్లిపై గెలిచారు. జనసేనకు 32 వేల ఓట్లు పడ్డాయి. అయితే ఈ సారి కూడా ఇక్కడ వైసీపీ-టి‌డి‌పిల మధ్యే పోరు జరగనుంది.  కారుమూరి, అరిమిల్లి మధ్య పోరు హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కారుమూరి మంత్రిగా ఉన్నారు. ఆయనకు అధికార బలం ప్లస్. అటు ప్రభుత్వ పథకాలు అడ్వాంటేజ్.

అయితే సరైన అభివృద్ధి జరగకపోవడం, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం మైనస్. ఇటు టి‌డి‌పి నేత రాధాకృష్ణకు గతంలో చేసిన అభివృద్ధి ప్లస్…అలాగే ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. కానీ జనసేన వల్ల మైనస్ ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన పొత్తులో రాధాకృష్ణ పోటీ చేస్తే సులువుగా గెలుస్తారు. కానీ విడివిడిగా పోటీ చేస్తే గెలుపు కష్టమే. మళ్ళీ కారుమూరికి అడ్వాంటేజ్ అవుతుంది.

ఒకవేళ పొత్తు ఉన్నా సరే ఈ సీటు కోసం టి‌డి‌పికి ధీటుగా జనసేన కూడా పోటీ పడే ఛాన్స్ ఉంది. ఈ పోరు వల్ల తేడా జరిగి..ఓట్లు బదలాయింపు జరగకపోతే టి‌డి‌పికి దెబ్బపడుతుంది. అంటే ఇక్కడ పొత్తు సరిగ్గా సెట్ అయితేనే టి‌డి‌పికి ప్లస్. లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచేస్తుంది.