భీమిలిలో టీడీపీ వర్సెస్ జనసేన..అవంతికి అడ్వాంటేజ్.!

భీమిలి నియోజకవర్గం టి‌డి‌పి కంచుకోట…ఇక్కడ 1983 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో మళ్ళీ టి‌డి‌పి జెండా ఎగిరింది. 2019లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈయన 9 వేల ఓట్ల తేడాతో గెలిస్తే..జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది.

అయితే ఈ సారి భీమిలిలో పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. వైసీపీ-టి‌డి‌పిలతో పాటు జనసేన కూడా గట్టిగానే పోరాడనుంది. కాకపోతే ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. మొదట పొత్తు ఉంటే ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది ప్రశ్న. వాస్తవానికి టి‌డి‌పికే ఎక్కువ బలం ఉంది. గత ఎన్నికల్లో టి‌డి‌పికి 91 వేల ఓట్లు పడితే..జనసేన 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు తమ బలం పెరిగిందని జనసేన అంటుంది. అటు టి‌డి‌పి సైతం తమకు ప్రజల మద్ధతు పెరిగిందని చెబుతుంది.

ఇలా రెండు పార్టీల మధ్య సీటు విషయంలో తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అవేం లేకుండా మూడు పార్టీలు సెపరేట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలిపోయి అవంతికి అడ్వాంటేజ్ అవుతుంది. అదే సమయంలో పొత్తు ఉంటూ..సీటు కోసం గొడవలు పడి..టి‌డిపి లేదా జనసేన గాని సీటు దక్కించుకుంటే ఓట్లు బదలాయింపు జరగదు.

టి‌డి‌పికి సీటు దక్కితే జనసేన ఓట్లు పూర్తి స్థాయిలో పడవు. అలాగే జనసేనకు సీటు దక్కితే దాదాపు లక్ష వరకు ఉన్న టి‌డి‌పి ఓట్లు..పూర్తిగా బదిలీ కావు. ఇలా జరిగిన అవంతికే ప్లస్. టి‌డి‌పి-జనసేన మధ్య పర్ఫెక్ట్ గా పొత్తు ఉంటేనే భీమిలి సొంతం అవుతుంది..లేదంటే వైసీపీ వశమే.