చంద్రముఖితో `జైల‌ర్‌`కు ఉన్న సంబంధం ఏంటి.. మ‌ళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లోనే `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శివరాజ్ కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఆగ‌స్టు 10న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. ఈ సినిమాలో `కావాలయ్యా` సాంగ్ కు విపరీతమైన ఆదరణ ల‌భించింది. ఎక్కడ చూసినా ఆ పాటే వినిపిస్తోంది. స్టార్ సెల‌బ్రెటీలు సైతం ఈ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్నారు. అయితే ఇదే త‌రుణంలో ఓ సెంటిమెంట్ తెర‌పైకి వ‌చ్చింది.

జైల‌ర్ మూవీని ర‌జ‌నీకాంత్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `చంద్ర‌ముఖి`తో లింక్ పెడుతున్నారు. జైల‌ర్ లో కావాలయ్యా సాంగ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు లిరిక్స్ తో మొదలవుతుంది. అలాగే చంద్రముఖి మూవీలో `దేవుడ దేవుడా` సాంగ్ కూడా తెలుగు పదాలతోనే మొదలవుతుంది. చంద్రముఖి రజినీకాంత్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. చంద్ర‌ముఖి సెంటిమెంట్ రిపీట్ అయితే జైల‌ర్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ర‌జ‌నీ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.