దేవర నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న స్పెషల్ వీడియో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న దేవర చిత్రం త్వరలోనే మూడవ షెడ్యూల్ కి సిద్ధంగా ఉంది.. దేవర చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

Devara Release Date, Star Cast, Trailer, Budget, Makers, Plot, Box Office, Reviews & More - JanBharat Times

వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ వీడియోని పంచుకోవడం జరిగింది మేకర్స్ .సినిమా రిలీజ్ కు ఇంకా 250 రోజులు ఉందంటూ కొరటాల శివ వాయిస్ ఓవర్ తో ఉన్న ఒక వీడియోని చిత్ర బృందం అభిమానుల కోసం ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఈ వీడియో ఓపెన్ చేస్తే కథలు మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి ఆ మృగాలకు భయం అంటే తెలియదు దేవుడంటే భయం లేదు చావంటే అసలు భయం లేదు కానీ ఒక్కడుంటే చాలా భయం అంటూ దేవర అంటూ గతంలో కొరటాల శివ ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలతో ఈ వీడియోని సింక్ చేసి విడుదల చేయడం జరిగింది.

యువ సుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో కొరటాల శివ తిరిగి తన మార్కు చూపించుకుంటారేమో చూడాలి మరి.