ఆ తప్పు చేశానని ఒప్పుకున్న సీనియర్ నటుడు నరేష్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ఒకప్పటి నటుడు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయన నటించిన మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఫుల్ గా హంగామా చేసిన నరేష్ ఈ మధ్య మాత్రం చాలా సైలెట్ అయ్యారానే చెప్పాలి.  నరేష్ 50 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 250 కి పైగా సినిమాలో హీరోగా, తండ్రి గా, ఫ్రెండ్ ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. అయిన కూడా ఆయన ఆకలి ఇంకా తీరలేదట. ఈ విషయం స్వయంగా నరేషే చెప్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నరేష్ ‘ చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను ‘ అని చెప్పారు. అలానే ఈ సందర్బంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. నరేష్ మాట్లాడుతూ ” తొమ్మిదేళ్ళ వయసులోనే బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘ పండంటి కాపురం’ అనే సినిమాలో నటించాను. చిన్నతనంలోనే కృష్ణ, విజయనిర్మల, ఎస్వి రంగారావు లాంటి మహానటులతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నాను. అప్పుడు పడిన పునాదే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. నిజానికి బాలనటులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా నిలదోక్కుకున్న వాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో నేను ఒకడిని కావడం నా అదృష్టం ” అని ఆయన తెలిపారు.

‘అలానే సినిమాలు వదిలేయ్యాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మధ్యలో ఒకసారి రాజకీయాలోకి వెళ్ళాను . నాకు అదొక సరికొత్త అనుభవం. అలా సడన్ గా ఇండస్ట్రీ నుండి బయటకి వెళ్లడం తప్పే. దానివల్ల హీరోగా నేను తెచ్చుకున్న మంచి గుర్తింపు పోవడమే కాకుండా, ఆర్థికంగా కుడా చాలా నష్టపోయాను. నేను రాజకీయాలోకి వెళ్ళగానే ఇండస్ట్రీ లో కొంతమంది నా గురించి దుష్ప్రచారం చేసారు. అప్పుడే నాకు నావాళ్ళు ఎవరో, బయట వాళ్ళు ఎవరో అర్ధం అయింది. వాళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల నేను ఇండస్ట్రీ లోకి తిరిగివచ్చిన తరువాత కూడా చాలామంది నన్ను చిన్నచూపు చూసారు . కానీ నేను చూసిన రాజకీయ జీవితం నన్ను ధైర్యం గా ఉండేలా చేసింది ‘ అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.