1,2 కాదు ఎకంగా 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల ను రిజెక్ట్ చేసిన ప్ర‌భాస్‌.. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతున్నట్లుందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తమ బ్యాడ్ లక్ పక్కనే ఉంటే మంచి మంచి సినిమాలు వదులుకోక తప్పదు . అలాంటి బ్యాడ్ లక్ కొన్నేళ్లపాటు తన పక్కనే క్యారీ చేసుకొచ్చాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ . బాహుబలి సినిమాకి ముందు ప్రభాస్ ఎలాంటి డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తన సినిమాల కథల విషయంలో ఆయనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారట .

అందుకే కొన్ని కొన్ని సార్లు ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియక తన బాడీకి మ్యాచ్ అవ్వని కథలను చూస్ చేసుకుని ప్లాప్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ప్రభాస్ తన కెరియర్ లో మొత్తంగా ఎనిమిది బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశారట . ఆ సినిమాలో ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం..!!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్య . నిజానికి ఈ కథను ముందుగా సుకుమార్ – ప్రభాస్ కి వినిపించాడట . అయితే సుకుమార్ కొత్త డైరెక్టర్ కావడంతో కథను నమ్మలేక రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బృందావనం సినిమా సైతం వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్ కి వివరించారట . అయితే ప్రభాస్ ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కావడంతో రిజెక్ట్ చేశారు అంటూ తెలుస్తుంది .

ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ఒక్కడు.. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ ..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి ..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్.. వివి వినాయక దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ .. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో తెరకెక్కిన డాన్ శీను.. ఇలా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను సింపుల్ రీజన్ తో రిజెక్ట్ చేసి కెరీర్ లో ప్రభాస్ బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అనేలా కామెంట్స్ దక్కించుకున్నాడు . త్వరలోనే ప్రాజెక్టుకె ద్వారా బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు ప్రభాస్..!!