బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు.

ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులు దక్కించుకున్నారు. దీంతో పిల్లి మళ్ళీ తన సొంత సీటు రామచంద్రాపురంపై ఫోకస్ పెట్టారు. పైగా చెల్లుబోయిన మంత్రి అయ్యాక తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదని, గెలిపించిన వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని అంటున్నారు. నెక్స్ట్ ఈ సీటు తన వారసుడుకు కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్‌ని జగన్ పిలిపించి మాట్లాడారు. ఈ క్రమంలో వేణుపై పిల్లి పలు ఫిర్యాదులు చేశారట. అలాగే కార్యకర్తల అభిప్రాయం మేరకు సీటు ఇవ్వాలని అడిగారట.

అలాగే తన వారసుడు సీటు కోసం ఎంపీ పదవి అడ్డు అనుకుంటే వదులుకోవడానికైనా రెడీ అని చెప్పారని తెలిసింది. దీంతో ఇప్పుడు సీటు విషయం జగన్ చేతుల్లో ఉంది. ఆయన రామచంద్రాపురం సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అక్కడ సర్వే చేయించి ఎవరికి మెజారిటీ ఉంటే వారికి సీటు ఇస్తారా? లేదా? మంత్రి చెల్లుబోయిన వైపు మొగ్గు చూపుతారా? అనేది చూడాలి. మొత్తానికి సీటు విషయంలో పిల్లి గట్టి పట్టుబడుతున్నారు. సీటు దక్కకపోతే పిల్లి సంచలన నిర్ణయం దిశగా అయిన వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.