ఒకప్పుడు ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు.. కానీ చివరికి అనాథగా మారి..

బెంగాలీ మహిళ కానన్ దేవి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అయితే ఆమె గురించి అసలు తెలిసి ఉండదు. అసలు కానన్ దేవి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే కానన్ పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె 1916, ఏప్రిల్ 22న రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రికి సంగీతంపై ఉన్న పట్టుతో కానన్ కి కూడా సంగీతంలో శిక్షణ ఇచ్చాడు.

కొంతకాలానికి కానన్ తండ్రి మరణించడంతో ఆర్థిక సమస్యలు కుటుంబానికి వెంటాడాయి. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి రావడంతో ఆ ఇంటి యజమాని కానన్ ని ఆమె తల్లిని ఇంటినుండి వెళ్లగొట్టాడు. దాంతో ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియక కొంతమంది ధనవంతుల ఇంట్లో పాచి పనికి వెళ్లారు తల్లీకూతుర్లు. ఆ సమయంలో కానన్ బంధువు ఒకరు వారికీ సహాయం చేసి, తలదాచుకోడానికి ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. కానీ కొన్ని రోజులకే అతని మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటకు పెట్టి కానన్ తో తన తల్లితో గొడ్డు చాకిరీ చేయించి, వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

దాంతో కానన్ తన తల్లితో కలిసి అక్కడి నుండి బయటకు వచ్చేసి తిరిగి హౌరాకి వెళ్లిపోయింది. కానన్ కుటుంబానికి సనిహితుడైన తులసి బెనర్జీ కానన్ ని చూసి తన సినిమాలో నటించగలదని గ్రహించాడు. ఆ సమయంలో కానన్ వయసు 10 ఏళ్ళు. మాధవ్ మూవీ స్టూడియోలో ‘ జైదేవ్ ‘ అనే సినిమా లో కానన్ నటించింది. దానికి గాను కానన్ నెలకి రూ.5 జీతం తీసుకుంది. అలానే గాయనిగా కూడా తన సత్తా చాటుకుంది. ఎన్నో సినిమాలో బాలనటిగా నటించిన కానన్ 21 ఏళ్లకు హీరోయిన్ గా మారింది. అప్పట్లోనే ఆమె అందానికి విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఆ తరువాత హీరోయిన్ గా రూ. 5 లక్షలు, గాయనిగా రూ. లక్ష తీసుకునేది. కానన్ మొత్తం 40 పాటలు పాడింది. అలానే 57 సినిమాలో నటించింది. అప్పట్లిన్ అందరిచేత మేడం అని పిలిపించుకున్న ఏకైక హీరోయిన్ కానన్ అని చెప్పాలి.