మరో బ్లాక్ బస్టర్ హిట్ విజయ్ ఆంటోని.. హత్య ట్రైలర్..!!

తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ ఉన్నారు. ఎక్కువగా కంటెంట్ బేస్డ్ ఉన్న పాత్రలోనే ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. రీసెంట్గా బిచ్చగాడు-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు తాజాగా హత్య అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల చేయడం జరుగుతోంది.

Movie Update: Vijay Anthony's “Hatya” Trailer Released .. !

గడిచిన కొన్ని గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది.. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఎంత జీవితంలో గెలిచిన చావు దగ్గర తప్పకుండా ఓడిపోతాం అంటూ మీనాక్షి చౌదరిని చూపిస్తూ ఒక ప్రొఫెషనల్ మోడల్ గా మొదలు పెడతారు.. అయితే ఇందులో తనని చంపేశారు అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. డిటెక్టివ్ పాత్రలు విజయ్ ఆంటోని నటించారు. అక్కడ నుంచి ఆమె ఎలా చనిపోయింది ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే కోణంలో ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు.

విజయ్ ఆంటోని అసిస్టెంట్ గా రీతిగా సింగ్ పాత్ర ఉన్నది.. ఒక మోడల్ హత్య మిస్టరీ వెనుక చేదించే కథ అంశం ఉన్నట్లుగా ఈ ట్రైలర్లు తెలుస్తోంది అయితే చనిపోయిన లైలా ఆ డిటెక్టివ్ కి ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది. జులై 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఈసారి కూడా విజయ్ అంటోని మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.