సినీ ఇండస్ట్రీకి అందుకే దూరమయ్యా.. అబ్బాస్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో అబ్బాస్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ప్రేమదేశం సినిమాలో అతను అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గా కూడా పేరు సంపాదించారు. రజనీకాంత్ కమలహాసన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు కూడా నటించిన ఈయన ఎందుకో సినీ ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. తాజాగా న్యూజిలాండ్లో ఈ హీరో స్థిరపడ్డట్టు తెలుస్తోంది. కుటుంబాన్ని పోషించలేక ఒకానొక సమయంలో టాక్సీ డ్రైవర్ గా పెట్రోల్ బంకులో సైతం పనిచేసినట్లుగా వార్తలు వినిపించాయి.అయితే తాజాగా తను సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

actor abbas life painful and inspiring experience video

అబ్బాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తను ఎప్పుడు యాక్టివ్ గా ఉండనని తాను పదవ తరగతి ఫెయిల్ అయ్యానని అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం కావడంతో జీవితం పై విరక్తి వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తెలిపారు.. కానీ ఆ బాధ నుంచి ఎలాగోలాగా బయటపడ్డానని తెలియజేశారు.కరోనా సమయంలో జూమ్ కాల్ ద్వారా అభిమానులను పలకరించానని తెలియజేశారు. తనలాగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో నుంచి మార్పు తీసుకువచ్చానని తెలిపారు

Suicidal ideation; Worked as a mechanic and taxi driver for a living; Actor Abbas opens his mind

తాను అనుకోకుండా నటుడిని అయ్యానని..తను నటించిన మొదటి సినిమా ప్రేమ దేశం సూపర్ హిట్ కావడం చేత ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి మా ఇంటి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం జరిగింది. వారీని చూసి ఆశ్చర్యపోయాను.. కానీ వారి ఎందుకో తనపైన అంతలా ప్రేమను చూపించారో తనకి ఇంకా అర్థం కాలేదని తెలిపారు. కెరియర్ ప్రారంభంలో బాగానే అవకాశాలు వచ్చిన ఆ తర్వాత కెరియర్ సాఫీగా సాగలేదని ఒకానొక సమయంలో చిన్నచిన్న అవసరాలను తీర్చుకునేందుకు కూడా డబ్బులు లేవని.. ఆ సమయంలో నిర్మాత ఆర్.బి చౌదరిని కలిశాను ఒక చిత్రంలో అవకాశం ఇచ్చారు కానీ కొద్ది రోజులకు నటన పైన ఆసక్తి తగ్గిపోయింది అందుకే సినిమాలకి దూరంగా ఉన్నానని తెలిపారు.