చెల్లుబోయినకు సెగలు..ఎంపీ వారసుడుతో చిక్కులు.!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి.

నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం సీటు పిల్లిదే..అక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. 2012లో జగన్ కోసం కాంగ్రెస్‌ని, పదవిని వదిలేసి వచ్చారు. ఆ ఉపఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఓడిపోయారు.

ఇక 2019లో ఆర్ధికమైన ఇబ్బందులు వల్ల పిల్లి..చెల్లుబోయినని తీసుకొచ్చి రామచంద్రాపురం బాధ్యతలు దక్కేలా చేశారు. అయితే పిల్లి..మండపేట వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఇటు రామచంద్రాపురంలో చెల్లుబోయిన గెలిచారు. ఇక జగన్..పిల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. తర్వాత మండలి రద్దు నెపంతో రాజీనామా చేయించి..రాజ్యసభ ఇచ్చారు. ఇక మంత్రి పదవి చెల్లుబోయినకు దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన సొంత సీటులోనే పోటీ చేయాలని పిల్లి చూస్తున్నారు. అది కూడా తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే బోస్ వర్గీయులు..మంత్రి వేణుకు వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారు. దీంతో వేణుకు ఇబ్బందిగా మారింది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో వేణుకు సీటు దక్కిన పిల్లి వర్గం మాత్రం సపోర్ట్ ఇచ్చేలా లేదు. అటు టి‌డి‌పి-జనసేన కలిస్తే ఇంకా రిస్క్ పెరగడం ఖాయం.