ఆ పని చేయలేక.. ఇండస్ట్రీకి దూరమయ్యా పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రీతి జింగానియా.. తన క్యూట్ అందాలతో మాటలతో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ అమ్మడికి మంచి పేరు రావడం జరిగింది. ఆ వెంటనే బాలయ్యతో నరసింహుడు నాగార్జున మోహన్ బాబు నటించిన అధిపతి చిత్రంలో నటించినది. కానీ ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.

Preeti Jhangiani - Hot and Cool

ఆ తర్వాత అప్పారావు డ్రైవింగ్ స్కూల్, విశాఖ ఎక్స్ప్రెస్, యమదొంగ పదో చిత్రాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించింది. తెలుగులో త్వరగా ఫెడ్ అవుట్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం తన హవా చూపించింది. అక్కడ భారీ పాపులారిటీ సంపాదించింది దాదాపుగా 13 ఏళ్ల గ్యాపులో 40 సినిమాలు చేసింది ప్రీతి జింగానియా. అలా సినిమాలు చేస్తున్న సమయంలోనే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అందుకు గల కారణాన్ని తాజాగా తెలియజేసినట్లు తెలుస్తోంది . వాటి గురించి తెలుసుకుందాం.

Prime Video: Thammudu

ప్రీతి జింగానియా మాట్లాడుతూ కోరుకున్న పాత్రలు దక్కలేదని దీంతో మనసు చంపుకొని సినిమాలు చేయలేకపోయానని.. తనకు ఇష్టమైన పాత్రలు రాలేదని వచ్చిన పాత్రలతో సంతోషంగా లేనని సినిమాలలో కీలకమైన పాత్రలు చేయాలని ఉండేది..అలాగని తాను హైలెట్ కావాలని కోవడం లేదు.. కానీ ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తే బాగుంటుందని అలాంటివి రానప్పుడు చాలా నిరాశకు గురయ్యాను అసంతృప్తితో కూడా ఉండేదాన్ని అందుకే ఒక అడుగు వెనక్కి వేసి సినిమాలకు దూరమయ్యానని తెలియజేస్తోంది. తాను సినిమాలు చేయలేదు కానీ సినీ రంగానికి దూరం కాలేదని తెలియజేసింది ప్రీతి జింగానియా. ప్రీతి జింగానియా నటుడు డైరెక్టర్ పర్వీన్ 2008లో వివాహం చేసుకుంది ప్రస్తుతం వీరు ముంబైలో ఉంటున్నట్లు సమాచారం.