ప్రకాశంలో లోకేష్..కందుకూరులో టీడీపీ నేతల పోటీ..సీటు ఎవరికి?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది. 15వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి మొదలుపెట్టి..ప్రకాశంలోని కందుకూరులోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇక కందుకూరులో లోకేష్‌కు టి‌డి‌పి నేతలు, శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఇక కందుకూరులో లోకేష్ ఎంట్రీ ఇవ్వగానే..అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు లోకేష్ తో మాట్లాడటానికి పోటీ పడ్డారు. మొదట టి‌డి‌పి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు లోకేష్ వెంట నడిచారు. ఆ వెంటనే లోక్ సభ టి‌డి‌పి ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేశ్ పాదయాత్రతో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మరో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం లోకేష్‌ని కలిశారు.

ఈ నలుగురు కందుకూరు నియోజకవర్గం నేతలే. నలుగురు సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే కందుకూరులో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉన్న సరే…అక్కడ టి‌డి‌పి గెలవదు. ఏదో 1994, 1999 ఎన్నికల్లోనే గెలిచింది. అప్పుడు టి‌డి‌పి నుంచి శివరాం గెలిచారు. తర్వాత వరుసగా ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోతుల రామారావు గెలిచారు..నెక్స్ట్ ఆయన టి‌డి‌పిలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోతుల పోటీ చేసి ఓడిపోయారు.

ఇక చివరికి పోతులని సైడ్ చేసి ఇంటూరి నాగేశ్వరరావుకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఇలా వరుసగా నాయకులు మారుతూ వచ్చారు. అయినా సరే ఓ వైపు ఇంటూరి నాగేశ్వరరావు..మరో వైపు పోతుల, దివి శివరాం సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు యువనేత ఇంటూరి రాజేశ్ సైతం సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇలా కందుకూరు సీటు కోసం టి‌డి‌పి నేతలు పోటీ పడుతున్నారు. మరి చివరికి సీటు ఎవరికి దక్కుతుందో..ఈ సారైనా అక్కడ టి‌డి‌పి గెలుస్తుందో లేదో చూడాలి.