మ‌త్తు క‌ళ్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో చిచ్చు పెట్టేసిన బేబ‌మ్మ‌.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!

యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో రోజురోజుకు హద్దులు దాటేస్తోంది. ఇంత‌కుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది.

బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్‌ చేసింది. మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఏం అందం రా బాబు అంటూ బేబ‌మ్మ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే కెరీర్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో య‌మా జోరు చూపించిన కృతి శెట్టికి గ‌త‌ ఏడాది నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది. వరుసగా నాలుగు ఫ్లాపులు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో ల‌క్కీ బ్యూటీ అన్న‌వారే.. ఆమెను ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ప్రస్తుతం తమిళ్ మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేస్తోంది. తెలుగులో మాత్రం పెద్ద‌గా ఆఫర్లు రావ‌డం లేద‌ని అంటున్నారు.