రెండవ రోజు దుమ్ము దులిపేస్తున్న బేబీ మూవీ కలెక్షన్స్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన చిత్రాలలో బేబీ సినిమా కూడా ఒకటి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు సరైన సక్సెస్ లేకుండా సమయంలో బేబీ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అందుకు తగ్గట్టుగానే బేబీ సినిమాకు భారీ స్పందన లభించడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రావట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం.

Baby Movie Review: A Morally Ambiguous Drama That Thrives In The Flaws Of Its Characters

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.ఇందులో నాగబాబు, వైవహర్ష తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పైన తెరకెక్కించారు ఈ చిత్రం జూలై 14న గ్రాండ్గా విడుదల అవ్వడం జరిగింది. ఈ సినిమా హక్కులకు భారీగానే పోటీ ఏర్పడింది నైజాంలో రూ.2.25 కోట్ల రూపాయలు పలకగా ఆంధ్రాలో రూ.2.80 కోట్ల రూపాయలు సిజెడ్లు కోటి రూపాయలు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.35 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా రూ.7.40 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇక రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో రెండవ రోజు చూసుకుంటే నైజాంలో రూ.1.35 కోట్లు సీడేడ్ రూ.39 లక్షలు.. ఉత్తరాంధ్రలో 48 లక్షలు.. ఈస్ట్ గోదావరి లో రూ.20 లక్షలు.. కృష్ణాలో రూ .17 లక్షలు నెల్లూరులో రూ.10లక్షలు గుంటూరులో రూ .17 లక్షలు.. ఇలా మొత్తం అన్ని కలుపుకొని దాదాపుగా మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు కాబట్టిది ఇక షేర్ విషయానికి వస్తే రూ.5.15 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండవ రోజు ఏకంగా రూ.2.25 కోట్ల రూపాయలు రాక మొత్తం రూ.9.80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే రూ.13.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.