జోగి తిట్ల దండకం..సీటు కోసమా?

రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు భజన చేయడం..చంద్రబాబు, పవన్‌లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే వైసీపీలో పలువురు మంత్రి పదవులు సాధించారు. ఆ కోవలోనే జోగి రమేష్ సైతం మంత్రి పదవి దక్కించుకున్నారని టి‌డి‌పి, జనసేన శ్రేణులు అంటున్నాయి. మంత్రి కాక ముందు ఈయన..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలని బూతులు తిట్టారు. ఈ ఘటనలే ఆయన్ని మంత్రి చేశాయని చెబుతున్నారు. ఇక మంత్రి అయ్యాక ఆయన శాఖ పరంగా చేసే కార్యక్రమాలు తక్కువ..అధికారం చెలాయించడం ఎక్కువని ప్రతిపక్ష శ్రేణులు అంటున్నాయి.

ఆయన అధికార హవా ఎలా ఉందంటే..ఉదాహరణకు తాజాగా పెడన నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తున్నారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై వెళుతుంది. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఓ వ్యక్తి ఫోన్ చూస్తూ కూర్చుకున్నారు. దీంతో మంత్రికి కోపం వచ్చి..తన కాన్వాయ్ వస్తున్న సరే అతను లేచి నిలబడలేదని, తక్షణమే అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలు కాన్వాయ్ వెళితే లేచి నిలబడకపోతే అరెస్ట్ చేస్తారని అక్కడ టి‌డి‌పి శ్రేణులు నిరసన తెలియజేయడంతో అరెస్ట్ చేసిన వ్యక్తిని విడుదల చేశారు. ఈ సంఘటన బట్టి జోగి అధికార హవా ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు అని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇక తాజాగా అమరావతిలో జగన్ ఎదుటే జోగి..చంద్రబాబుని ముసలి నక్క, లోకేష్‌ని ఊరపంది, పవన్‌ని పిచ్చి కుక్క అంటూ దారుణంగా మాట్లాడారు.

ఇక ఇలా మాట్లాడి జగన్‌ని మెప్పించి జోగి ఇంకా ఏదో సాధించాలని చూస్తున్నారని అంటున్నారు. ఎలాగో నెక్స్ట్ పెడన సీటు దక్కదని ప్రచారం వస్తుంది. ఈ నేపథ్యంలో సీటు కోసమే జోగి ఇలా ప్రతిపక్ష నేతలని తిడుతున్నారని అంటున్నారు.