మైలవరంలో ఉమాకు పట్టు దొరకడం లేదా?

టీడీపీలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఇప్పుడు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు కృష్ణా జిల్లా టి‌డి‌పి అంటే ఈయన పేరే గుర్తొచ్చేది. పెత్తనం మొత్తం ఈయన చేతుల్లోనే ఉండేది. ఇక ఈయన పెత్తనం వల్లే జిల్లాలో టి‌డి‌పి దెబ్బతిందని టాక్ ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారని అంటారు.

సరే గతంలో ఏం జరిగిందో గాని..ఇప్పుడు రాజకీయంగా ఉమాకు కలిసి రావడం లేదు. 2019 ఎన్నికల ముందు వరకు బాగానే ఉంది..కానీ 2019లో తొలిసారి ఓటమి పాలైన ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటివరకు వరుసగా నాలుగుసార్లు గెలిచారు. కానీ 2019లో తొలిసారి వసంత కృష్ణప్రసాద్ చేతులో ఓటమి పాలయ్యారు. ఇక మైలవరం బరిలో ఓడిపోయాక అక్కడ పికప్ అవ్వడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏది అనుకూలంగా రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే వసంత బలంగానే ఉన్నారు.

అదే సమయంలో ఆయనకు టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని మద్ధతుగా నిలవడం ఉమాకి మైనస్ అవుతుంది. పైగా జిల్లాపై ఉమా పెత్తనం తగ్గిపోయింది. ఆయనకు టి‌డి‌పి అధిష్టానం వద్ద కూడా పెద్ద ప్రాధాన్యత దక్కడం లేదు. ఇటు నియోజకవర్గంలో కేశినేని నానితో తలనొప్పి అనుకుంటే…మరో టి‌డి‌పి నేత బొమ్మసాని సుబ్బారావు సైతం ఉమాకు యాంటీగా పనిచేస్తున్నారు. ఈయనకు కేశినేని మద్ధతు ఉంది.

ఇలా ఉమాకు అన్నీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. పైగా స్థానికులకే సీటు ఇవ్వాలని బొమ్మసాని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసుకున్న ఉమాకు ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఈ సారి ఉమా మైలవరం బరిలో గెలవగలరా? లేదా? అనేది డౌట్ గానే ఉంది. మొత్తం మీద ఉమాకు మైలవరంపై పట్టు దొరకడం లేదు.