ఎట్టకేలకు తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించిన ఇలియానా..!!

టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్గా పేరుపొందింది ఇలియానా. గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ సన్నజాజిలాగా తన అందచందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉండేది. కానీ ఇలాంటి పాపులారిటీతో బాలీవుడ్లోకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూడు సినిమాలతో బాగానే అలరించిన ఆ తర్వాత ఫెడవుట్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా పలు రకాల ఎఫైర్స్ కారణంగా కూడా ఈమె కెరియర్ సజావుగా సాగలేదని చెప్పవచ్చు.

Mom-to-be Ileana D'Cruz finally REVEALS her mystery man; shares pics from  romantic date night | PINKVILLA

హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేమలో పడి బ్రేకప్ జరగడం ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లడం వంటివి జరిగింది అలాంటి సమయంలోనే ఇలియానా చాలా బొద్దుగా మారిపోయింది. దీంతో తిరిగి ఇలియానా మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలను బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసి అందరికీ ఒకసారిగా షాక్ ఇచ్చింది.

ఇక పలు రకాల బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఇలియానా. కానీ తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గా దాచి పెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా బాయ్ ఫ్రెండ్ ని రివ్యూ చేయడం జరిగింది.తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసింది. అయితే ఇలియానా గతంలో కత్రినా కైఫ్ తమ్ముడు తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వినిపించాయి..కానీ ఈ ఫోటోలో ఉన్నది మాత్రం సేబాష్టియన్ కాదు. మరి ఇతడి పేరు ఇలియానా తెలియజేస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.