బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా `బేబీ`.. మూడు రోజుల్లోనే భారీ లాభాలు!

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ `బేబీ`. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో బేబీ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. తొలి నుంచి అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంటున్న బేబీ.. మూడు రోజుల్లోనే లాభాల బాట ప‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బేబీ.. ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.60 కోట్లు, రెండో రోజు రూ. 2.98 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు అంద‌రి అంచ‌నాలను మించిపోయి రూ. 3.77 కోట్లు రాబ‌ట్టింది. అలాగే వ‌రల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ. 11.33 కోట్ల షేర్, రూ. 20.90 కోట్ల గ్రాస్‌ వ‌సూల్ చేసి.. రూ. 3.33 కోట్ల ఫ్రాఫిట్ తో దూసుకుపోతోంది. ఇక ఏరియాల వారీగా బేబీ మూడు రోజుల క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 3.93 కోట్లు
సీడెడ్: 1.25 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.55 కోట్లు
తూర్పు: 72 లక్ష‌లు
పశ్చిమ: 42 లక్ష‌లు
గుంటూరు: 53 లక్ష‌లు
కృష్ణ: 60 లక్ష‌లు
నెల్లూరు: 35 లక్ష‌లు
—————————————————–
ఏపీ+తెలంగాణ = రూ. 9.35 కోట్లు(రూ. 16.30 కోట్లు~ గ్రాస్)
—————————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా= 43 లక్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 1.55 కోట్లు
—————————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్‌= రూ. 11.33 కోట్లు(రూ. 20.90 కోట్లు~ గ్రాస్)
—————————————————–