వచ్చే ఎన్నికల్లో బిజేపి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టిడిపి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టిడిపికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బిజేపితో కలిస్తే..బిజేపికి ఏపీలో యాంటీ మొత్తం టిడిపి పై పడుతుంది.
అదే సమయంలో బిజేపికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో బలం ఉంది..దీంతో ఆ పార్టీ ఏది చెబితే అది బాబు చేయాలి. వారి డిమాండ్లకు తగ్గట్టే పొత్తు ఉండాలి. అలా జరిగిన బాబుకు నష్టమే. ఎటు తిప్పిన బిజేపి-జనసేనతో కలిస్తే టిడిపికి డ్యామేజ్ తప్పదు. అలా అని పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన సరే టిడిపికి నష్టమే. బిజేపి-జనసేన ఓట్లు చీలుస్తాయి. అప్పుడు వైసీపీకి లాభం.
ఇప్పటికే పురందేశ్వరి…బిజేపి-జనసేన పొత్తు ఫిక్స్ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవలే ఆమెని ఏపీ బిజేపి అధ్యక్షురాలుగా నియమించారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. టిడిపిని దెబ్బకొట్టడానికే ఇదంతా చేస్తున్నారా? అనే డౌట్ ఉంది. సరే ఎలా జరిగిన బిజేపి వల్ల టిడిపికి నష్టం మాత్రం గ్యారెంటీ. అయితే బిజేపి-జనసేన సిఎం అభ్యర్ధి అంశం కేంద్రం చూసుకుంటుందని పురందేశ్వరి అంటున్నారు. అయితే రెండు పార్టీల పొత్తు మాత్రమే ఉంటే పవన్ సిఎం అభ్యర్ధి అని జనసేన శ్రేణులు అంటున్నాయి.
అసలు టిడిపి కలిసిన సరే పవన్ మాత్రమే cm అభ్యర్ధి అని చెబుతున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్న చంద్రబాబుకు చిక్కులు తప్పవని చెప్పవచ్చు.