అక్కినేని నాగార్జున హీరోగానే కాకుండా హోస్ట్ గా బిగ్ బాస్ షో కి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల బిగ్ బాస్ -7 సీజన్ కి సంబంధించి ఒక ప్రోమో ని కూడా విడుదల చేశారు.అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాగార్జున కు నిన్నటి రోజున నోటీసులను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ పిటిషన్ లో దాఖలైన నేపథ్యంలో హైకోర్టు స్పందించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే స్టార్ మాతో పాటు నాగార్జునకు కూడా నోటీసులను జారీ చేయడం జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం నాలుగు వారాలు వాయిదా వేయాలని సూచించింది. ఈలోపు ప్రభుత్వం స్టార్ మా నిర్వాహకుల నుంచి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.. దీంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీ అంశంగా మారుతున్నది.. గతంలో కూడా బిగ్ బాస్ పైన ఇలాంటి పిటిషన్లు చాలానే దాఖలు అయ్యాయి కానీ షో మాత్రం ఎవరు ఆపలేకపోయారు.. గత ఆరు సీజన్లో విజయవంతంగా సక్సెస్ అయిన ఈసారి విజయవంతంగా రన్ అవుతుందో లేదో తెలియాల్సి ఉన్నది.
త్వరలో ప్రారంభం కాబోతున్న ఏడవ సీజన్ సంబంధించి ప్రోమోన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఆదివారం స్టార్ మా లో బిగ్ బాస్ షో కి సంబంధించి ఒక ఈవెంట్ను కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.. గతంలో పాల్గొన్న కంటిస్టెంట్లు అందరూ ఇందులో పాల్గొనబోతున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది..ఈసారి కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరించబోతున్నారు. మరి ఈ షోని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో బిగ్ బాస్ ప్రియులకు ఇది ఒక షాకే అని చెప్పవచ్చు.