బీజేపీలో ఆగని లొల్లి..కాంగ్రెస్ వైపే ఆ నేతల చూపు.!

తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోకి ఇంకా జంప్ అవ్వడానికి నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగిన విషయం తెలిసిందే.బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పెద సంఖ్యలో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటంతో…బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి.

ఇటు బి‌జే‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ బలం ఊహించని విధంగా పడిపోయింది. ఇక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుని కూడా మార్చారు.బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు జంప్ అవ్వకుండా ఉండటానికి వారికి కీలక పదవులు ఇచ్చారు. అయినా సరే బి‌జే‌పిలో కొందరు నేతలు జంపింగ్‌కే సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈటల జంపింగ్ నేతల దగ్గరకెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈటల సన్నిహితుడు ఏనుగుల రవీంద్ర రెడ్డిని జంప్ అవ్వకుండా చేయాలని చూస్తున్నారు.

ఇటు మాజీ మంత్రి చంద్రశేఖర్ సైతం బి‌జే‌పిని వదిలిపోవాలని చూస్తున్నారు. అసలు కేసీఆర్‌ అవినీతి గురించి మోదీ మాట్లాడడం కాకుండా.. చర్యలు తీసుకుంటేనే ప్రజలు బీజేపీని నమ్ముతారని ఆయన అంటున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అందర్నీ అరెస్ట్‌ చేసి… ఒకరిద్దర్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అలాగే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఇలా మాట్లాడుతుండటంతో ఆయనతో ఈటల భేటీ అయ్యి బుజ్జగించే ప్రయత్నం చేశారు.అయినా సరే చంద్రశేఖర్ బి‌జే‌పిలో ఉండేలా లేరు..ఆయన కాంగ్రెస్ లోకి జంప్ చేసేలా ఉన్నారు.