వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది.
సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదగా విడుదల చేయించారు. `హౌరా బ్రిడ్జి దగ్గర ఇంకో అమ్మాయి మిస్సింగ్ అంట సార్`.. అంటూ సాగే సంభాషణలతో మొదలైన ట్రైలర్ ఆధ్యంతం పూనకాలు తెప్పించింది.
కలకత్తాలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతారు. ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరు ఉన్నారు? అన్నది పరిష్కరించలేని పోలీసులు భోళా భాయ్ దగ్గరకు వెళతారు. ఆ భోళా శంకర్ ఏం చేశాడు? ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. చిరంజీవి గ్రేస్ ఫుల్ యాక్టింగ్, ఆయన స్వాగ్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అద్భుతం. ఇందులో లాయర్ గా నటించిన తమన్నా.. రంగస్థలంలో రామ్ చరణ్ కు బాబులా యాక్ట్ చేస్తున్నాడు అంటూ చిరును ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్ హైలెట్ అయింది. ఇక మహతి స్వర సాగర్ అందించిన బీజీఎమ్ బాగా అలరించింది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. ఆగస్టు 11న థ్రియేటర్స్ లో మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాతర ఖాయంగా కనిపిస్తోంది. మరి లేటెందుకు మీరు కూడా భోళా శంకర్ ట్రైలర్ పై ఓ లుక్కేసేయండి.