2025లో ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న రష్మిక… క్రేజీ న్యూస్ లీక్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ‘గీతగోవిందం’ . ఈ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వారిద్దరు మాత్రం మేము మంచి స్నేహితులమని చెప్పుకొస్తున్నారు. అయితే విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం లాంటివి చూసి అందరికి వాళ్ళమధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అని గట్టిగ అంటున్నారు.

రష్మిక,విజయ్ వారి ప్రేమ విషయం బయట పడకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ప్రేక్షకులు కొన్ని కారణాలు చూపించి వారిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. విజయ్ కి సంబందించిన ఏ చిన్న ఈవెంట్ అయిన అక్కడ రష్మిక కచ్చితంగా కనిపిస్తుంది. అలానే ఈమధ్య ఇద్దరూ కలిసి మాల్ధీవ్స్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఒకే స్విమింగ్ పూల్ లో కలిసి కనిపించారు. ఇంకేముంది ఆ ఫోటోలను చూపించి ‘చూసారా ఇద్దరు హాలీడే ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు ‘ అంటూ చాలామంది ప్రచారం చేసారు. ఇక గతంలో విజయ్ దేవరకొండ ఒక ఈవెంట్ కి వేసుకొచ్చిన షర్ట్ ని తాజాగా జరిగిన ఈవెంట్ లో రష్మిక వేసుకొచ్చింది.


ఇక వారిద్దరూ వేసుకున్న షర్ట్స్ ని పక్కపక్కనే పెట్టి కంపేర్ చేస్తూ వారు ప్రేమించుకుంటున్నారు అని అనడానికి ఇదే సాక్ష్యం అంటూ గట్టిగా వాదిస్తున్నారు . అయితే మరికొంతమందేమో నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. 2025లో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు.నిజంగానే వారు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ వారి పెళ్లి విషయం ఎంత వరకూ నిజం అనేది విజయ్, రష్మిక లో ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలుస్తుంది . మరి అభిమానులు కోరుకున్నట్లు వారు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది చూడాలి.