కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమా లో నటించి స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ స్టైలే వేరు. పర్సనల్గా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో ఎవరంటే అజిత్ అనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ లో కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ప్రస్తుతం అజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ఆయనకేంతో ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తుంటాడు. బైక్ రైడింగ్ పై ఉన్న ఇష్టంతో ఇప్పటికే ఎన్నో దేశాలను బైక్ పై చుట్టి వచ్చాడు. త్వరలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో అజిత్ కి ఎలాంటి అకౌంట్స్ లేవు. అయితే అతనీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ తెలుసుకోవాలన్న అజిత్ మేనేజర్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా అజిత్ న్యూ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ లో అజిత్ కాస్త యంగ్ గా కనిపిస్తున్నాడు. చెన్నై విమానాశ్రయంలో కనిపించిన అజిత్ ని ఆయన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేసారు.
ఆ వీడియోస్ లో అజిత్ తన లగేజ్ ని పట్టుకొని విమానంలోకి వెళ్తూ కనిపించాడు. రెడ్ పోలో నెక్ టీ షర్ట్, జీన్స్ వేసుకొని నెరిసిన జుట్టుతో, గడ్డం తో చాలా స్టైలిష్ గా కనిపించాడు అజిత్. 52 ఏళ్ల వయసులో కూడా తన చిరునవ్వుతో చాలా యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటాడు. సోషల్ మీడియాలో అజిత్ ఫోటోలు వైరల్ అవ్వడంతో అతని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అజిత్ డైరెక్టర్ మగిజ్ తిరుమేని దర్శకత్వం లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.