`బేబీ` దెబ్బ‌కు చిత్తైన `అర్జున్ రెడ్డి` రికార్డులు.. పెద్ద కొండను చిన్న కొండ మించిపోయాడు!

బేబీ.. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఇందులో హీరోగా న‌టించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. వైష్ణ‌వి చైత‌న్య కీల‌క పాత్ర‌ను పోషించాడు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామా జూలై 14న విడుదలై పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది.

టాక్ అనుకూలంగా ఉండ‌టంతో బేబీ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. కేవ‌లం రూ. 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. విడుద‌లైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకున్న బేబీ.. 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ‘బేబీ’ విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి` లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. అర్జున్ రెడ్డి రికార్డుల‌ను చిత్తు చిత్తు చేసింది.

దీంతో చిన్న దేవ‌ర‌కొండ పెద్ద దేవ‌ర‌కొండ‌ను మించిపోయాడంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక బేబీ బాక్సాఫీస్ వ‌ద్ద ఇదే జోరును కంటిన్యూ చేస్తే ఖ‌చ్చితంగా 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కానీ, రేపు ప‌వ‌ర్ స్టావ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో` విడుద‌ల కాబోతోంది. బ్రో మూవీకి పాజిటివ్ టాక్ వ‌స్తే బేబీ చిత్రానికి ఖ‌చ్చితంగా థియేట‌ర్స్ త‌గ్గుతాయి. మ‌రి బ్రో మూవీ ధాటిని బేబీ త‌ట్టుకోగ‌ల‌దా.. లేదా.. అన్న‌ది చూడాలి.