ఐశ్వర్యరాయ్, వెంకటేష్ మధ్య ఇంత కథ నడిచిందా.. అదేంటో తెలిస్తే!

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లెజెండరీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎటువంటి గర్వం, పొగరు లేకుండా కో-ఆర్టిస్టుల దెగ్గర నుండి అసిస్టెంట్స్ వరకూ అందరికి మర్యాద ఇస్తాడు వెంకటేష్. అందుకే వెంకటేష్ అంటే అందరికీ చాలా ఇష్టం. అందరితో సరదాగా కలిసిపోయి,గౌరవంగా ఉండే వెంకీ లాంటి హీరోకి కూడా ఒక హీరోయిన్ కోపం తెప్పించింది.

అసలు ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా ? . ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. ఆమె తెలుగు లో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘రావోయి చందమామ ‘ అనే సినిమాలో ఒక పాట లో మాత్రం ఐశ్వర్య కనపడింది. గతంలో విక్టరీ వెంకటేష్, ప్రీతి జింటా జంటగా నటించిన ‘ ప్రేమంటే ఇదేరా’ అనే సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హీట్ అయింది. అయితే ఈ సినిమాలో ప్రీతి జింటా కి బదులు ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉంది. దర్శక నిర్మాతలు మొదట ఐశ్వరరాయ్ ని కలిసి డేట్స్ ఇవ్వమని అడగగా డేట్స్ కోసం ఆమె వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టిందట. ఒకసారి డేట్స్ ఇస్తానని, మరోసారి ఆమె చెప్పిన డేట్స్ లోనే షూటింగ్ ఉండాలని నిర్మాతలని మూడు చెరువుల నీళ్లు తాగించిందట.

షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చినా తరువాత హోటల్ రూమ్ బుక్ చెయ్యడం దెగ్గర నుండి ఆమె స్టాఫ్ ఖర్చుల వరకు అన్ని నిర్మాతలే భరించాలి అనే కండిషన్ కూడా పెట్టిందట. అంతేకాకుండా అప్పట్లోనే కోటి రూపాయల వరకూ రెమ్యూనేషన్ కూడా కావాలని అడిగిందట. దాంతో రూ. 50 లక్షలు ముందే ఇవ్వాలని కూడా కండిషన్ పెట్టిందట. అంతటితో ఆగకుండా రొమాంటిక్ సీన్స్ లో నటించను అని, షూటింగ్ లేని టైమ్ లో హీరో ఆమెకు దూరంగా ఉండాలని ఇలా చాలా కండిషన్స్ పెట్టిందట ఐశ్వర్య రాయ్. ఇదంతా తెలిసిన వెంకటేష్ వెంటనే ఐశ్వర్యరాయ్ కి ఫోన్ చేసి గట్టిగ వార్నింగ్ ఇచ్చాడట. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీ ల చాలా రోజులు మాట్లాడుకున్నారు.

ఆ తరువాత బాలీవుడ్ లో ఆమె కంటే పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ప్రీతి జింటాని సంప్రదించారు. ప్రీతీ జింట, ఐశ్వర్య రాజ్ కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ‘ ప్రేమంటే ఇదేరా ‘ సినిమా లో వెంకటేష్ తో కలిసి నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి టాలీవుడ్ లో ప్రీతి జింట క్రేజ్ బాగా పెరిగిపోయింది.