సూప‌ర్ స్టార్ తో న్యాచుర‌ల్ స్టార్‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన నాని!

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌లె `ద‌స‌రా` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నాని `హాయ్ నాన్న‌` అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ కాగా.. శృతి హాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెర‌కెక్కిస్తున్న‌ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది.

ఇందులో నాని ఒక పాప‌కు తండ్రి పాత్ర‌ను పోషిస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈ సంగ‌తి ప‌క్కన పెడితే.. నాని తాజాగా ఓ క్రేజీ ఆఫ‌ర్ కొట్టేశాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నాడు. జైల‌ర్ అనంత‌రం ర‌జ‌నీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నాడు. మ‌రికొద్ది రోజుల్లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో నాని కూడా న‌టిస్తున్నాడ‌ట‌. అయిదే నానీది గెస్ట్ రోల్ కాద‌ని.. క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నానీతో సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ట‌.